Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జగదీష్ రేషన్ దుకాణంలో ఈ కేవైసీ నమోదు ప్రారంభం

జగదీష్ రేషన్ దుకాణంలో ఈ కేవైసీ నమోదు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
కొత్త రేషన్ కార్డుదారులు, కొత్త పేర్లు నమోదు చేసుకున్న వారు రేషన్ కార్డుకు ఆధార్ తో ఈ కేవైసీని అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలంలోని జగదీష్ రేషన్ దుకాణంలో శుక్రవారం ఈ కేవైసీ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు పవన్ కాంబ్లే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత, కొత్త రేషన్ కార్డు దారులు తప్పనిసరిగా ఈ కేవైసీని చేసుకోవాలని, లేనియెడల వినియోగదారులు రేషన్ బియ్యం నిలిపివేయడం జరుగుతుందన్నారు. చెప్పారు. ఈ కేవైసీ అనుసంధానానికి ఈ నెల 31 చివరి తేది అని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -