Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లో విద్యాసంస్థల బంద్ విజయవంతం

మద్నూర్ లో విద్యాసంస్థల బంద్ విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ, ఎన్ టి ఏ వ్యవస్థను రద్దు, విద్యారంగం బలోపేతం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన విద్యాసంస్థల బంద్ మద్నూర్ మండలంలో విజయవంతమైంది. ఈ బంద్‌కు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వచ్చందంగా మద్దతు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌కు సహకరించిన అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు, అధ్యాపకులకు, విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వ విద్యను పరిరక్షించే పోరాటంలో ప్రజల సహకారం మరింత బలాన్నిస్తుందని ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు మహేమూద్, నితిన్, సునీల్, సందీప్, తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -