- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని సోమ లింగాల గుట్ట శివాలయంలో శ్రావణమాసం నాలుగో శనివారం సందర్భంగా సాక్షర స్కూల్ కరస్పాండెంట్ సందీప్‌కుమార్ శనివారం మహాన్నదాన కార్యక్రమం చేపట్టారు. హౌసింగ్ బోర్డ్, టీచర్స్ కాలనీలో గల ఆంజనేయ ఆలయాల వద్ద కూడా మహ అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం ప్రతి సోమ, శని వారాల్లో సామూహిక అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు ఆయనను అభినందించారు.
- Advertisement -



