- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్‌జీ విద్యార్థులు నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. ఈ ఆందోళనల్లో నటుడు ఆదిత్య ఓం పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. పోలీసుల లాఠీచార్జ్‌ను ఖండిస్తూ ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి.
- Advertisement -



