Homeహైదరాబాద్ఉస్మానియా యూనివర్సీటీ నుంచి గుర్రం లక్ష్మణ్ కు డాక్టర్ డిగ్రీ

ఉస్మానియా యూనివర్సీటీ నుంచి గుర్రం లక్ష్మణ్ కు డాక్టర్ డిగ్రీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సీటీ నుంచి గుర్రం లక్ష్మణ్ డాక్టర్ డిగ్రీ అందుకున్నారు. తెలంగాణ మూవ్మెంట్ హిస్టారికల్ పర్సెక్టివ్(Telangana Movement: Historical Perspective (1969–2014) అనే అంశంపై టీం సూపర్ వైజర్ డాక్టర్ పి. రమేష్ ఆధ్వర్యంలో అధ్యయనం చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనూతుల గ్రామానికి చెందిన యాదయ్య-సువార్త దంపతుల కుమారుడు గుర్రం లక్ష్మణ్.. బాల్యం నుంచి ఉన్నత విద్యను అభ్యసించాలనే పట్టుదలతో తొమ్మిది, పది వరకు మండల కేంద్రంలోని నవోదయ పాఠశాల, ఇంటర్ క్షత్రియ జూనియర్ కాలేజ్, నల్లగొండలోని ఎన్జీ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సీటీ(OU)లో హిస్టరీ సజ్జెక్టు నందు పొస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత తెలంగాణ మూవ్మెంట్ హిస్టారికల్ పర్సెక్టివ్(Telangana Movement: Historical Perspective (1969–2014) అనే అంశంపై పరిశోధన(PH.D) పూర్తి చేసి తాజాగా డాక్టరేట్ అందుకున్నారు. ఓయూ నుంచి డాక్టరేట్ అందుకున్న గుర్రం లక్ష్మణ్ ను మిత్రులు,శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు, జూనూతుల గ్రామస్తులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -