Saturday, July 25, 2026
E-PAPER
Homeజాతీయంఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP), పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ ఆందోళనలు, విద్యాశాఖ జవాబుదారీతనం వహించాలనే తీవ్ర ఒత్తిడి మధ్య ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇది విద్యార్థుల విజయమని, తాము తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని పేర్కొంటూ పోస్టులు పెడుతున్నారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి రిజైన్ చేయాల్సిందేనని పట్టుబట్టారని, అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించారని ప్రశంసిస్తున్నారు. విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని మరోసారి నిరూపించారని అంటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాన్‌ స్పందిస్తూ.. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్టు తెలిపారు.

‘‘గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. నీట్‌ అక్రమాలు వెలుగులోకి రాగానే.. సీబీఐ విచారణకు ఆదేశించాం. విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించాం. బాధ్యతల నుంచి నేను ఎప్పుడూ తప్పుకోలేదు. యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశాను. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే రాజీనామా నిర్ణయం తీసుకున్నా. యువత తమ చదువుల కోసమే సమయం కేటాయించాలి. మంత్రిగా ఇన్నాళ్లు నాకు అవకాశం కల్పించిన మోడీకి కృతజ్ఞతలు’’ అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -