- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధలోని శాఖాపూర్ గ్రామంలో పశువుల నీటి తొట్లను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు నీటి తొట్లను శుభ్రపరచడమే మరిచిపోయారు. అసలే వర్షాకాలం కావడంతో తొట్లల్లో నీటితో పాటు చెత్తాచెదారం పేరుకుపోయాయి. తొట్ల చుట్టూ పాకర పేరుకుపోయి నీళ్లు నీలిరంగులో దర్శనిమిస్తున్నాయి. అంతేకాదు .. పాకర పట్టిన నీళ్లమీద ఈగలు, దోమలు వాలుతూ.. మురుగు వాసన వెదజల్లుతోంది. ఈ నీటిని గ్రామంలోని పశువులు తాగినా అనేక రకాల రోగాల బారిన పడటం ఖాయం. ఈ విషయమై గ్రామ కార్యదర్శి, సర్పంచ్ కలిసి జీపీ సిబ్బందితో పశువుల నీటి తొట్లను పరిశుభ్రం చేయించి, పశుసంపదను కాపాడాలని గ్రామ పశువుల దారులు కోరుతున్నారు.
- Advertisement -



