Saturday, July 25, 2026
E-PAPER
Homeజాతీయంధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..విద్యార్థులకు,యువతకు సీపీఐ(ఎం) అభినందనలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..విద్యార్థులకు,యువతకు సీపీఐ(ఎం) అభినందనలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంగా దేశంలోని విద్యార్థులకు, యువతకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో అభినందనలు తెలియజేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉపయోగించిన లాఠీలు ఇతర అణచివేత చర్యలను సైతం ఎదుర్కొని, వివిధ వర్గాల ప్రజలు, సంస్థల మద్దతుతో దేశ విద్యార్థులు, యువత ప్రదర్శించిన దృఢ సంకల్పం చేసిన త్యాగాల వల్లే ఈ విజయం సాధ్యమైంది. యువత చూపిన ధైర్యం పట్టుదల భారత ప్రజాస్వామ్యానికి నిదర్శనం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి వైదొలగడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, పదేపదే జరుగుతున్న పేపర్ లీక్‌లకు ప్రధానంగా బాధ్యత వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. పరీక్షల వికేంద్రీకరణ జరగాలన్న తమ డిమాండ్‌ను సీపీఐ(ఎం) మరోసారి పునరుద్ఘాటిస్తోంది. వాణిజ్యీకరణ, కేంద్రీకరణ, మతతత్వాన్ని ప్రధానాంశాలుగా కలిగిన జాతీయ విద్యా విధానం, 2020ను కూడా రద్దు చేయాలి. ఈ చర్యలు తీసుకోనంత వరకు, ప్రశ్నపత్రాల లీకులు, వివక్షల గాథ కొనసాగుతూనే ఉంటుంది. తమ భవిష్యత్తుకు సంబంధించిన ఈ డిమాండ్లపై విద్యార్థులు, యువజన ఉద్యమాలు ప్రచారం చేసి, ఆందోళనలు కొనసాగిస్తాయని ఆశిస్తున్నామని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -