Sunday, July 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆ.. అబ్బాయే కావాలి

ఆ.. అబ్బాయే కావాలి

- Advertisement -

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ, వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి’. శివాల ప్రభాకర్ దర్శకుడు.వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగిన ఈ వేడుకకు దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకులు సి.రాం ప్రసాద్, శివనాగు, టి. తుమ్మలపల్లి రామసత్యనారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని, పవన్ మహావీర్ కి ఇది పరిచయ చిత్రమంటే నమ్మడం కష్టమని’ అతిథులు పేర్కొన్నారు. నిర్మాత జి. శైలజరెడ్డి మాట్లాడుతూ,’సినిమా అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు` అని అన్నారు.హీరో మహావీర్ మాట్లాడుతూ,’ఈ చిత్రం ఇంత గొప్పగా రావడం కోసం మనసుపెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆగస్టు 7న మీ ముందుకు వస్తున్నాం` అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -