Saturday, July 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త 'సౌండ్ ఇంజనీర్'

సరికొత్త ‘సౌండ్ ఇంజనీర్’

- Advertisement -

నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 23వ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి. నిర్మిస్తోంది. చినిమిల్లి మణి కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని భరత్ చౌదరి నిర్మిస్తున్నారు.
రోహిత్ నారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్ర నిర్మాతలు టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సౌండ్ ఇంజనీర్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. స్పీకర్‌లా కనిపించే హార్ట్ సింబల్ ‘O’ అక్షరంతో కూడిన క్రియేటివ్ డిజైన్ టైటిల్ లోగో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చేతితో రాసిన నోట్స్, ధ్వని తరంగాలు, విచిత్రమైన డూడుల్స్‌తో కూడిన ఈ డిజైన్, హీరో ఇంట్రస్టింగ్ వరల్డ్ ని పరిచయం చేస్తుంది. టైటిల్ తో పాటు, కథానాయకుడి ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. హాస్య నటుడు సుదర్శన్ వాయిస్ తో ఈ వీడియో, రోహిత్ నారా పాత్రకు వినికిడి లోపం ఉందని తెలివిగా సూచిస్తూ, అతనికి ‘సౌండ్ ఇంజినీర్’ అనే ట్యాగ్ తెచ్చిపెట్టింది. రోహిత్ నారా సరసన నయన్ సరిక కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -