సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచ యం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భుపతి దర్శకుడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో జై కృష్ణ ఘట్టమనేని మీడియాతో ముచ్చటిం చారు. నాకు చిన్నప్పటి నుంచి సినిమా లంటే ఇష్టం. నటనలో ట్రైనింగ్ తీసుకున్నాను. జెమినీ కిరణ్ ద్వారా ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఆయనే దర్శకుడు అజయ్ ని పరిచయం చేశారు. అజయ్ చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. మహేష్ బాబాయ్ సినిమా చూసి, చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆయ నకు చాలా నచ్చింది. నాకు మెసేజ్ కూడా పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, సాంగ్స్ చాలా నచ్చాయని, స్క్రీన్ మీద చాలా డిఫరెంట్‌గా ఉన్నానని, క్యారెక్టర్‌లోకి పూర్తిగా వెళ్లిపోయా నని చెప్పారు. అశ్వినీ దత్ తో నాకు మంచి అను బంధం ఉంది. వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. క్యారెక్టర్స్, ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రా రస్టిక్ గా అనిపిస్తాయి. అలాగే ఇది ఒక టెం ప్లేట్ లవ్ స్టోరీ కాదు. ఇందులో చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. ట్విస్టులు చాలా కొత్తగా ఉంటాయి. రాషా తడానీ నటించడం ఈ సినిమాకి ఒక మంచి అసెట్. తనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్.
సాధారణ ప్రేమకథ కాదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



