సూర్య హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొంది స్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘నేనో బటర్‌ఫ్లై’ విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఉత్సాహంతో ‘ది వెడ్డింగ్ సాంగ్’ రూపంలో అభిమానులకు చిత్ర బృందం రెండవ గీతాన్ని పరిచయం చేసింది. ఈ గీతం విడుదలైన తక్షణమే అందరినీ అలరిస్తూ, అసలుసిసలైన వేడుకల గీతంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ కుటుంబ కథా చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యతారాగణం.
తొలి పాటకు మించి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



