Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విలాసాగర్‌లో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

విలాసాగర్‌లో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని విలాసాగర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. మండల హాడక్ కమిటీ అధ్యక్షుడు ఇసునం మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొత్త కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షుడిగా మంచినీళ్ల స్వామి రాజు, గౌరవ అధ్యక్షుడిగా షేక్ కలీం, ఉపాధ్యక్షుడిగా అనిల్, ప్రధాన కార్యదర్శిగా బన్నీ, కోశాధికారిగా అరవింద్‌లను ఎంపిక చేశారు. అలాగే సభ్యులుగా మధుకర్, రఘుపతి, సురేష్, రాకేష్, రాజు, అజయ్‌లను నియమించారు.
ఈ సందర్భంగా మండల హాడక్ కమిటీ అధ్యక్షుడు ఇసునం మహేందర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి యువకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -