Sunday, July 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'అమీర్ లోగ్' ఎవరు?

‘అమీర్ లోగ్’ ఎవరు?

- Advertisement -


అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని ఆగస్ట్ 21న విడుదల చేయనుంది. రిలీజ్ డేట్‌తో పాటు ‘అవ్వల్ దావత్’ సాంగ్‌ని కూడా విడుదల చేశారు. దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ,’హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని ఈ సినిమా తీశాను. డబ్బులున్న వారు అమీర్ లోగా?, సంతోషంగా ఉండే వారు అమీర్ లోగా? అన్నది ఈ చిత్రం చూసిన తర్వాత అర్థం అవుతుంది. ఈ సినిమాలో ఫిలాసఫీ ఉంటుంది. ఈ మూవీ చూసిన తర్వాత హైదరబాద్ మనుషుల మీద మరింత ప్రేమ, గౌరవం పెరుగుతుంది` అని అన్నారు. ‘అందరూ మా సినిమాని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఈ సినిమాకి దర్శకుడు: రమణారెడ్డి సోమ, నిర్మాత: మాధవి రెడ్డి సోమ, సహ నిర్మాత: మనోహర్ రెడ్డి మంచురి, డీఓపీ : ఎస్వీకే, ఎడిటర్: రోహిత్ పెనుమత్స, సంగీతం: స్మరణ్ సాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -