హీరో హవీష్, దర్శకుడు త్రినాథరావు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘నేను రెడీ’. హార్నిక్స్ ఇండియా ఎల్.ఎల్.పి. బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ తొలి పాట ‘కొంచెం కొంచెం’ను లాంచ్ చేశారు. హీరో హవీష్ మాట్లాడుతూ,’నాకు కాస్త సిగ్గు ఎక్కువ. కానీ త్రినాథరావు నాతో ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయించారు (నవ్వుతూ). ఆయన ఈ కథ చెప్పినప్పుడే నేను చాలా ఎంటర్‌టైన్ అయ్యాను. ఈ సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. నా కెరీర్‌లో ఇది బెస్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందిఅని తెలిపారు. 'ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ పాట సినిమాలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇండస్ట్రీలోని డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటింగ్ టీమ్ అందరికీ సినిమా చూపించాం. ఎందుకంటే మా సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మైత్రి శశిధర్ కూడా ఇది 'నక్కిన మార్క్' సినిమా అన్నారు అని దర్శకుడు త్రినాథరావు నక్కిన తెలిపారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ,’త్రినాథరావు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు పెట్టింది పేరు. ‘నేను లోకల్’, ‘ధమాకా’లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ గా ఇది నిలవాలని కోరుకుంటున్నానుఅని అన్నారు. నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ, 'ఈ పాట చూశాను, చాలా అద్భుతంగా ఉంది. హవీష్‌కు ఈ సినిమాతో పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను. త్రినాథరావుకి ఇది కూడా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను అని చెప్పారు.
‘నేను రెడీ’ హిట్ ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



