Sunday, July 26, 2026
E-PAPER
Homeసోపతిపాదాలతోనూ వింటాయి

పాదాలతోనూ వింటాయి

- Advertisement -


మీకు తెలుసా?
ఎదుటివారితో మాట్లాడాలంటే గొంతు కావాలి. వారు చెప్పేది వినాలంటే చెవులుండాలి. కానీ ఏనుగులకు ఆ అవసరమే లేదని మీకు తెలుసా? అవి గొంతు విప్పకుండానే కిలోమీటర్ల దూరంలోని మిత్రులతో ముచ్చటిస్తాయి. మనుషులు వినలేని శబ్దాలనూ వింటాయి. భూమి పొరల్లో సంభవించే మార్పులను పాదాలతోనే పసిగడతాయి.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏనుగులు చెవులతోనే కాదు, పాదాలతోనూ వింటాయి. వీటి పాదాల్లో ‘పాసినియన్‌ కార్పస్కిల్స్‌’ అనే అత్యంత సున్నితమైన నరాల వ్యవస్థ ఉంటుంది. ఇవి భూమిలో వచ్చే అతి సూక్ష్మ ప్రకంపనలను ఇట్టే పట్టేస్తాయి. పాదాల ద్వారా గ్రహించిన ప్రకంపనలు, వాటి కాళ్ల ఎముకల ద్వారా నేరుగా చెవికి చేరుతాయి. దీన్నే సైన్స్‌ పరిభాషలో ‘బోన్‌ కండక్షన్‌’ అంటారు. పది కిలోమీటర్ల దూరంలో ఉన్నా తన మంద ఏ దిశలో వెళుతోంది? అక్కడ ఏదైనా ప్రమాదం ఉందా? అనే విషయాలను ఈ టెక్నిక్‌తోనే గ్రహిస్తాయి.

ఏనుగులు చేసే కొన్ని శబ్దాలు మనుషులకు అసలు వినిపించవు. వీటిని ‘ఇన్ఫ్రాసౌండ్‌’ (తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు) అంటారు. ఇవి గాలిలో కంటే భూమి ద్వారా వేగంగా, ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. దట్టమైన అడవిలో ఏనుగుల గుంపు చెల్లాచెదురైనప్పుడు, ఒకదానికొకటి సంకేతాలు ఇచ్చుకునేందుకు ఈ రహస్య భాషనే వాడతాయి. ఉరుములు, వర్షం రాకను ఇవి ముందుగానే పసిగట్టడానికి కారణం ఇదే.
ప్రకతి వైపరీత్యాలను ఏనుగులు కనిపెడతాయి. భూకంపం వచ్చే ముందు భూమి లోపల కలిగే మార్పులను ఇవి ముందే గుర్తించి, అశాంతికి లోనవుతాయి. 2004 సునామీ సమయంలో అలలు విరుచుకుపడక ముందే ఏనుగులు ఎత్తయిన ప్రాంతాలకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్న దాఖలాలున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టగానే మందలోని పెద్ద ఏనుగులన్నీ పిల్ల ఏనుగుల చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడటం వాటి సావ¶హిక బాధ్యతకు నిదర్శనం.
శాస్త్రీయనామం: ఎలిపాస్‌ మాక్సిమస్‌(ఆసియా ఏనుగు)
జీవితకాలం: 60-70 ఏండ్లు
మేధస్సు : ఏండ్ల కిందట చూసిన ప్రదేశాలు, మనుషులనూ గుర్తు పెట్టుకోగలవు.
గర్భధారణ సమయం: జంతు సామ్రాజ్యంలోనే అత్యధికంగా 18 నుంచి 22 నెలలు. అందుకే పిల్ల ఏనుగులు పుట్టిన 20 నిమిషాల నుంచి గంటలోపే నడుస్తాయి.
ఆహారం: రోజుకు సుమారు 150కిలోల ఆహారం (గడ్డి, గుమ్మడి, వెదురు, చెరకు, రాగి ముద్దలు) తీసుకుంటాయి.
తొండం: సుమారు 15 లక్షల కండరాలతో నిర్మితమై ఉంటుంది. అందుకే ఇవి నేలపై చిన్న సూదిని తీయగలవు, భారీ వక్షాలను సైతం కూల్చగలవు.
రూపాంతర దంతాలు: ఏనుగు దంతాలు నిజానికి రూపాంతరం చెందిన కోరపళ్లు, ఇవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. మగ ఏనుగులకు ఇవి ఆత్మరక్షణకు, బరువులు ఎత్తే ఆయుధాలుగా ఉపయోగపడతాయి. న ఏనుగులకు చెమట పట్టదు. ఇవి చెవులను వింజామరల్లా ఆడిస్తూ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకుంటాయి. న ఏనుగులు సుమారు 4 నుంచి 6వేల కిలోల బరువున్నప్పటికీ వాటి పాదాల కింద ఉండే మెత్తని కుషన్‌ లాంటి నిర్మాణం వల్ల అడుగు వేస్తే శబ్దం రాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -