నవతెలంగాణ – హైదరాబాద్ : ఆదివారం ఉదయం భారత మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్ప ఒడిదుడుకులకు లోనైన పసిడి ధరల్లో ఈరోజు ఎటువంటి మార్పులు నమోదు కాలేదు. దీంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించినట్లయింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు వంటి నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,930 వద్ద నిలకడగా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,32,850గా కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,700 వద్ద స్థిరంగా ఉంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన ముంబై, కోల్కతాలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ధరలే పలుకుతున్నాయి. అయితే, ఢిల్లీ, చెన్నై నగరాల్లో ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ, చెన్నైలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,33,000గా నమోదైంది. ఇక వెండి విషయానికొస్తే, హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2,40,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.



