Sunday, July 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం: చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు మృతి

విషాదం: చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖుజ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిల్ఖేడి జంక్షన్ వద్ద అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టి కారును బయటకు తీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతివేగం లేదా సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -