Sunday, July 26, 2026
E-PAPER
Homeజిల్లాలుసేవలాల్ దేవాలయ నిర్మాణానికి కృషి 

సేవలాల్ దేవాలయ నిర్మాణానికి కృషి 

- Advertisement -

స్వచ్ఛంద సేవ నాయకులు భాస్కర్ 
నవతెలంగాణ-మిడ్జిల్

గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ దేవాలయం నిర్మాణానికి కృషి చేస్తానని స్వచ్ఛంద సేవ రాష్ట్ర నాయకులు  జర్పుల భాస్కర్ నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని కాటోని గడ్డ తండాలో  సర్పంచ్ ధర్మానాయక్, గిరిజన మహిళలతో కలిసి సంతు సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. గుడి నిర్మాణానికి రూ.2 లక్షల అందజేస్తానని చెప్పరు. ఈ సందర్భంగా భాస్కర్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన తండాలలో ఉన్న పిల్లలందరినీ చదివించాలనీ, చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. తండాలలో నీటి కొరత నిర్మూలనకు తన సొంత నిధులతో బోరుబావిని వేయిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాలకు దూరంగా నివసిస్తున్న గిరిజన తండాలకు రహదారులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వహనాదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని సూచించారు. యువత చెడు వైపు వెళ్లొద్దని, డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని కోరారు. రాబోవు రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని తాండాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందుకు గిరిజన మహిళలు ఆయనకు డప్పు వాయిద్యాలతోటి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ  సర్పంచ్ భాస్కర్ నాయక్, నాను నాయక్, లక్ష్మణ్ నాయక్, నారియా నాయక్, రమేష్ నాయక్, గణేష్ నాయక్ , ఎండి రఫీ, చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -