Wednesday, March 18, 2026
E-PAPER
Homeక్రైమ్రైలులో స్టార్‌ తాబేలు పట్టివేత

రైలులో స్టార్‌ తాబేలు పట్టివేత

- Advertisement -

నిందితునికి14 రోజుల రిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎక్స్‌ప్రెస్‌ రైలులో అక్రమంగా తరలిస్తున్న స్టార్‌ తాబేలును రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్‌) సిబ్బంది పట్టుకున్నారు. సెక్యూరిటీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి సమాచారం రావడంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా అడ్డగుట్టకు చెందిన సురేష్‌ కుమార్‌ (32) అనే ప్రయాణికుడు భువనగిరి నుంచి సికింద్రాబాద్‌కు వస్తూ తాబేలు తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ఆర్పీఎఫ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తరువాత ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం నిందితుడికి 14 రోజులు రిమాండ్‌ విధించినట్టు హైదరాబాద్‌ డీఎఫ్‌ఓ శ్రీనివాస్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -