హైదరాబాద్‌కు తరలింపు
నవతెలంగాణ – నక్కలగుట్ట
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి గుండెపోటుతో ఆస్పత్రిలో పొందుతున్నారు. రెండు రోజులు గా జ్వరంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హన్మకొండ లోని రోహిణి ఆస్పత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, అలాగే యాంజియోగ్రామ్ చేయడం ద్వారా రక్తనాళాలలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడ్డాయని వాటిని తొలగించడానికి ఇంజక్షన్ ఇచ్చామని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ మమతారెడ్డి తెలిపారు. సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు హైదరా బాదు నుండి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీష్‌రావు, బి. వినోద్‌రావు ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. డాక్టర్లను సంప్రదించి హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపా యి. సుదర్శన్ రెడ్డికి గుండెపోటు రావడంతో పరామర్శిం చేందుకు బీఆర్‌ఎస్ నేతలు, మాజీ ఎంపీ కవిత, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, రాజయ్య తోపాటు కాంగ్రెస్ నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మార్నింగ్ రవీందర్రావు, బీజేపీ నుండి ఏ రాజేశ్వరరావు, ఎమ్ ధర్మారావు తో పాటు తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



