Sunday, September 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅసెంబ్లీ సజావుగా నడిచేందుకు సహకరించాలి

అసెంబ్లీ సజావుగా నడిచేందుకు సహకరించాలి

- Advertisement -

ఉన్నతాధికారులతో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌‌కుమార్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
అసెంబ్లీ సమావేశాలు సజావుగా నడిచేందుకు అందరూ సహకరించాలని శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర శాసనసభ, శాసన పరిషత్ వర్షాకాల సమావే శాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పా ట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శనివారం శాసన పరిషత్ సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని సూచించారు. సంబంధిత మెటీరియల్ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ముందస్తుగా సమర్పించాలని చెప్పారు. దీంతో సభ్యులు చదువుకుని సమావేశాలకు హాజరు కావడానికి అవకాశం ఉంటుందన్నారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందించాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమావేశాలు జరగడానికి పోలీసు శాఖ తరపున అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సభ లోపల, బయట కూడా ప్రశాంత వాతావరణం ఉంటేనే సమావేశాలు సజావుగా జరుగుతాయని వివరించారు.

తెలంగాణ పోలీసు శాఖకు దేశ వ్యాప్తంగా సమర్ధవంతమైనదిగా పేరుందన్నారు. శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించాల్సిన ‌బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. సభలు సజావుగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గతంలోలా కాకుండా ఇంకా వేగంగా అధికారులు పని చేయాలని అభిప్రాయపడ్డారు. నోడల్ అధికారులను నియమించి , సమావేశాలు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. ఈ సారి సమావేశాలు వాడీ వేడిగా జరిగే అవకాశం ఉందన్నారు. పోలీస్ శాఖ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇంటెలిజెన్స్ అధికారులు త్వరగా సమాచారం అసెంబ్లీ అధికారులకు అందించాలని చెప్పారు. ధర్నాలు , రాస్తారోకోలు జరగకుండా ప్రశాంతంగా సమావేశాలు జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శాసన వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చైర్మెన్‌, స్పీకర్ సూచనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకరోజు ముందే సంబంధిత ప్రశ్నలకు జవాబులను పంపాలని సూచించారు.

ఉభయ సభల సమావేశాల సమయంలో ప్రభుత్వం బాధ్యతగా ఉంటూ పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. ప్రతి శాఖ తరుపున ఒక అధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని వివరించారు. ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ సమర్ధతకు ఉభయ సభల సమావేశాలు నిదర్శనమన్నారు. అందుకే ప్రభుత్వ యంత్రాంగం తరుపున పటిష్టమైన చర్యలు తీసుకుని సమావేశాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరిస్తామన్నారు. ఈ సమావేశంలో కౌన్సిల్‌డిప్యూటీ చైర్మెన్‌ డాక్టర్ బండా ప్రకాష్ , కౌన్సిల్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసన పరిషత్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్ , డీజీపీ సివి ఆనంద్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి శిఖా గోయల్, పోలీస్‌ ‌శాంతిభద్రతల విభాగం డీజీ ‌మహేష్ భగవత్, అదనపు డీజీ(ఇంటెలిజెన్స్) విజయకుమార్, హైదరాబాద్ నగర పోలీస్‌ ‌కమిషనర్‌ సజ్జనార్, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, అసెంబ్లీ, కౌన్సిల్ చీఫ్ మార్షల్స్ కర్ణాకర్, సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -