Monday, July 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల హక్కుల
 కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్ ను గెలిపించండి

కార్మికుల హక్కుల
 కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్ ను గెలిపించండి

- Advertisement -

ఆర్టీసీ రక్షణ…ఉద్యోగ భద్రత ముఖ్యం :
​రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌. రావు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

ఆర్టీసీ రక్షణ- కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు కొనసాగిస్తున్న ‘కార్మిక వారధి- పోరాటాల సారధి’ స్టాప్ అండ్‌ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ను ఆదరించి రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో గెలిపించాలని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌.రావు ‌కోరారు.
ఆదివారం నల్లగొండ డిపోలో రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సంపూర్ణ ఉద్యోగ భద్రత, ప్రభుత్వం, యాజమాన్యంతో జరిగిన చర్చల సారాంశం, భవిష్యత్తు పరిష్కారాలపై కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌. రావు మాట్లాడుతూ ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కార్మికుల హక్కుల రక్షణ, ఆర్టీసీ రక్షణ కోసం పనిచేస్తుందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక ఐక్య పోరాటాలు చేశామన్నారు. కార్మికుల పట్ల చిత్తశుద్ధితో ముందుకు పోతున్న సంఘానికి కార్మిక వర్గం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన సమ్మె చర్చలో భాగంగా యాజమాన్యం, ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లను పెట్టామని గుర్తు చేశారు. ఉద్యోగ భద్రత, ఆర్టీసీ కార్మికుల విలీనం పై అధ్యయనం చేసి ఉద్యోగ భద్రతకు ఆటంకంగా ఉన్న రెగ్యులేషన్స్ మార్చాలని డిమాండ్ చేస్తున్న ఏకైక సంఘం ఎస్ డబ్ల్యూ ఎఫ్ మాత్రమే అన్నారు. రెండు నెలలు కావస్తున్న ఈడీల కమిటీలతో చర్చించిన అంశాల అమలు కోసం మళ్లీ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు, జూనియర్ అసిస్టెంట్ గా అర్హత పొందిన కార్మికులకు వెంటనే పోస్టింగులు ఇచ్చి రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలకు అనుమతి లేకున్నా కార్మికులకు వెన్నంటే ఉంటూ వారి కష్టాల్లో నష్టాల్లో పాలుపంచుకుంటూ అండగా ఉన్న సంఘం తమదేన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం ఐక్యత, కార్మికుల హక్కుల కోసం పనిచేసే సంఘం ఎఫ్ డబ్ల్యూ ఫ్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి కేఎస్. రెడ్డి, రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్, కోశాధికారి బైరు శ్రీ కాంట్లం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, నాయకులు ఎంసీ.మౌళి, నరసింహయ్య, గద్దర్, లింగయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -