Monday, July 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి నియామకం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి నియామకం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ ఫౌండర్ కల్వకుంట్ల కవిత సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం, ఆత్మగౌరవ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న జాగృతి, బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించింది. గత రెండు దశాబ్దాలుగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్న కవిత ఇకపై ఫౌండర్ చైర్పర్సన్‌గా కొనసాగుతారు. నూతన అధ్యక్షురాలి సారథ్యంలో సంస్థ తన లక్ష్యాల వైపు మరింత బలంగా పయనిస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -