Tuesday, July 28, 2026
E-PAPER
Homeజాతీయంసోనమ్‌ వాంగ్‌చుక్ డిశ్చార్జ్

సోనమ్‌ వాంగ్‌చుక్ డిశ్చార్జ్

- Advertisement -

​లడఖ్‌‌కు బయలుదేరిన సామాజిక కార్యకర్త
న్యూఢిల్లీ :
సామాజిక కార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తనను ప్రాణాలతో కాపాడిన మేదాంత హాస్పిటల్‌ వైద్య సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం లడఖ్‌కు బయలుదేరే ముందు సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌ రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా జంతర్ మంతర్ వద్ద సోనమ్‌‌ వాంగ్‌ చుక్‌ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 26 రోజులు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోనమ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జులై 18న ఆయనను పోలీసులు బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మేదాంత ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -