- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై ప్రతిపాదిత చర్చ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు అంతరాయం కలిగించడంతో పార్లమెంటు దిగువ సభ సోమవారం వాయిదా పడింది. లోక్‌సభను జూలై 28, ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్. అంతకుముందు, సాయంత్రం 5 గంటలకు సదురు బిల్లుపై అధికార, ప్రతిపక్షాలు చర్చను చేపట్టవచ్చని లోక్‌సభ స్పీకర్ పేర్కొన్నారు. ఈ బిల్లుకు సంబంధించి 91 సవరణలు ప్రతిపాదించబడ్డాయని ఆయన తెలిపారు. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు’పై సమగ్ర చర్చ కోసం ఆరు గంటల ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని బిర్లా ప్రతిపాదించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
- Advertisement -



