Monday, July 27, 2026
E-PAPER
Homeఖమ్మంరక్తదాతలే ప్రాణదాతలు: ఎమ్మెల్యే

రక్తదాతలే ప్రాణదాతలు: ఎమ్మెల్యే

- Advertisement -

– సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్
– కమల్ మిత్ర మోటార్స్, ఫార్మసీ వారి మెగా రక్తదాన శిబిరం
నవతెలంగాణ-సత్తుపల్లి 

రక్తానికి కులమతాలు ఉండవని, ప్రాణాపాయ స్థితిలో మనల్ని రక్షించేది రక్తం ఒక్కటేనని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. పట్టణంలోని కమల్ మిత్ర మోటార్స్, కమల్ మిత్ర ఫార్మసీ అధినేత మొహమ్మద్ రహమత్ పాషా జన్మదినం సందర్భంగా సోమవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ ముఖ్య అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడారు. రక్తదాతలు ప్రాణదాతలుగా ఆమె అభివర్ణించారు. మనమిచ్చేది కేవలం రక్తం కాదని మరొకరికి జీవన దానమన్నారు. రక్తదానం చేసే మనసున్న వారంతా శ్రీమంతులేనని ఆమె అన్నారు. మన నరాల్లో ప్రవహించే రక్తం మరొకరి గుండెల్లో ఊపిరి స్ఫూర్తిని నింపుతుందన్నారు. రక్తదానం మహాదానమని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడుతుందన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తున్న కమల్ మిత్ర మోటార్స్, ఫార్మసీ యాజమాన్య బాధ్యులు మొహమ్మద్ రహమత్ పాషాను ఎమ్మెల్యే అభినందించారు. 

100 మంది నుంచి రక్తనిధి సేకరణ
ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ నారాయణన్, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి రక్తదాన విభాగం సిబ్బంది, వాహిద్, అహ్మద్, వలి, ముస్తఫా, ఫిరోజ్ తో పాటు కమల్ మిత్ర మోటార్స్ అండ్ ఫార్మసీ సిబ్బంది, యువకులు, స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -