నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ ధమాకా, అనంతరం వరుసగా వైట్‌బాల్ ఫార్మాట్ సిరీస్‌లు ఆడిన టీమ్ ఇండియా.. ఎట్టకేలకు రెడ్‌బాల్ ఫార్మాట్లో మెరిసేందుకు సిద్ధమవుతోంది. శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్లకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తే.. మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఆగస్టు 15న తొలి టెస్టు, 23న రెండో టెస్టు ప్రారంభంకానుంది.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, గుర్నూర్, పడిక్కల్, సరాంశ్ జైన్.
శ్రీలంకతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపిక..
- Advertisement -
- Advertisement -



