నవతెలంగాణ-హైదరాబాద్: ట్రినిడాడ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జస్టిన్ గ్రీవ్స్ ‘సరికొత్త ఘనతను సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఏ క్రికెటర్ సాధించని రికార్డును అందుకున్నాడు. సిరీస్ ఆరంభ మ్యాచ్ మూడో రోజున, గ్రీవ్స్ టెస్ట్ ఫార్మాట్‌లో వరుసగా ఐదు వికెట్ లతో పాటు మెయిడెన్‌లు నమోదు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. భోజన విరామానికి ముందు, తర్వాత వేసిన స్పెల్స్‌లో గ్రీవ్స్ ఈ ఘనతను సాధించాడు. ఈ స్పెల్‌తోనే గ్రీవ్స్ టెస్ట్ క్రికెట్‌లో తొలిసారిగా ఐదు వికెట్లు పడగొట్టాడు. దీనితో, 2016 జనవరిలో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ నెలకొల్పిన వరుసగా నాలుగు వికెట్ మెయిడెన్‌ల పాత రికార్డును గ్రీవ్స్ తన పేరు మీద తిరగరాశాడు.
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జస్టిన్ గ్రీవ్స్ సరికొత్త రికార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



