- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ ప్రభుత్వం దమనకాండను ప్రదర్శిస్తోంది. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన స్థానికులపై ఆ దేశ ఆర్మీ బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.నిన్నటి నుండి ఎన్నికలను బహిష్కరిస్తున్న వారిలో, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) కోర్ కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి అయిన ఉమర్ నజీర్ కాశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్‌తో సహా 20 మందిని భద్రతా దళాలు హతమార్చినట్లు ఆ దేశ మీడియా వర్గాలు తెలిపాయి. గత 24 గంటల్లో కనీసం 20 మంది కాశ్మీరీలు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. జూన్ 5న పీఓకేలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి పాకిస్థాన్ బలగాల చేతిలో మరణించిన వారి సంఖ్య 80కి చేరింది.
- Advertisement -



