- Advertisement -
కట్టడికి కమ్యూనిస్టుల ఐక్యత అవసరం
నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్
దేశంలో మనువాద పార్టీ పేట్రేగి పోతున్నదని, దాన్ని కట్టడి చేసేందుకు కమ్యూనిస్టుల ఐక్యతకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అందులో భాగంగా రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారని, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు.
- Advertisement -



