Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు చెంతకు నూతన సాంకేతికత

రైతు చెంతకు నూతన సాంకేతికత

- Advertisement -

ఎల్ నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి : ‘రైతునేస్తం’ కార్యక్రమంలో మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రైతు‌ల చెంతకు నూతన సాంకేతికతను చేరవేయడమే ‘రైతునేస్తం’ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని బీఆర్‌.అంబేడ్కర్‌ ‌సచివాలయంలో నిర్వహించిన ‘రైతునేస్తం’ 100వ కార్యక్రమంలో మంత్రి జూపల్లితో కలిసి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లా డుతూ ప్రపంచంతో పోటీపడే వ్యవసాయం కోసం సాంకేతిక పరిజ్ఞానం అత్యంత అవసరమని పేర్కొ న్నారు. గత ప్రభుత్వం నిరుపయోగంగా వదిలేసిన వేదికలను రైతులకు ఉపయోగపడే విజ్ఞాన కేంద్రా లుగా మార్చే లక్ష్యంతో వీడియో కాన్ఫరెన్స్ సదు పాయం కల్పించి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారం భించామని తెలిపారు. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు ఒకే వేదికపై ప్రత్యక్షంగా చర్చించే అవకాశాన్ని కల్పించడం ద్వారా రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా 27.30 లక్షలకు పైగా రైతులు ప్రయోజనం పొందారని వెల్లడించారు. రైతులు అడిగే ప్రశ్నలకు శాస్త్రవేత్తల నుంచి సమాధానాలు లభిస్తున్నాయనీ, దీనివల్ల పంటలకు నష్టం కలగకముందే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తోందని మంత్రి వివరించారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. ఎల్-నినో ప్రభావం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాల పరిస్థితిని జిల్లా, మండలాల వారీగా రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. జూలై నెలలో 218 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 150 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసిందన్నారు. సాధారణంతో పోల్చితే 27 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో వర్షాలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ రైతులు నేరుగా శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పొందేందుకు రైతునేస్తం అద్భుతమైన వేదికగా నిలిచిందన్నారు. ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయశాఖ రూపొందించిన కంటింజెన్సీ ప్రణాళిక ప్రకారం రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, ఇతర సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదర్శ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రతి జిల్లాకు 5 గురు ఆదర్శరైతులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ బి. గోపి, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, రాష్ర్ట వ్యాప్తంగా 1600 రైతువేదికల ద్వారా లక్షలాది మంది రైతులు పాల్గొన్నారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -