Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపట్నం సోదరులను పరామర్శించిన హరీశ్‌‌రావు

పట్నం సోదరులను పరామర్శించిన హరీశ్‌‌రావు

- Advertisement -

నవతెలంగాణ-షాబాద్
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పట్నం’ కుటుంబాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు హరీశ్‌‌రావు, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు మంగళవారం పరామర్శించారు. వారి తల్లి పట్నం రుక్కమ్మ చిత్రపటానికి రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి నివాసంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ​పరామర్శించిన వారిలో.. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, చింత ప్రభాకర్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, మెతుకు ఆనంద్, మర్రి జనార్దన్‌రెడ్డి, ధర్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డీసీసీబీ మాజీ చైర్మెన్‌ కృష్ణారెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ బిందు, మహబూబ్‌నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్‌ రామకృష్ణ, డీసీసీ జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్‌ శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ షాబాద్, చేవెళ్ల మండల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింహాగౌడ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -