Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవెంటిలేటర్‌‌పైనే పెద్ది సుదర్శన్‌రెడ్డి

వెంటిలేటర్‌‌పైనే పెద్ది సుదర్శన్‌రెడ్డి

- Advertisement -


మరో 72 గంటలు కీలకం : వైద్యులు
కుటుంబ సభ్యులను పరామర్శించిన 
మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నవతెలంగాణ-బేగంపేట్

​సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డికి వెంటిలేటర్‌‌పైనే చికిత్స అందిస్తున్నట్టు యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో.. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని వెల్లడించారు. ఈఈజీ , ఎంఆర్ఐ బ్రెయిన్, టీసీడీఎస్ పరీక్షల్లో మెదడు దెబ్బతిన్నట్టు, ఆక్సిజన్ సరఫరా లోపానికి సంబంధించిన లక్షణాలు గుర్తించినట్టు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావడానికి మరో 72 గంటలు కీలకమని వైద్యులు పేర్కొన్నారు. భారీ పల్నొనరీ ఎంబోలిజంతో షాక్‌కు గురైనందున సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చిందని, వరంగల్‌లో థ్రాంబోలైసిస్ చికిత్స అందించాని వెల్లడించారు. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోం దని చెప్పారు. ఇప్పటికీ సుదర్శన్ రెడ్డికి వెంటిలేటర్‌పైనే చికిత్స చేస్తున్నామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి యశోద ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -