నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ లో బుధవారం కూడా అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. భోపాల్ లోని భోపాల్-నర్మదాపురం రహదారిపై బైటాయించారు. పెసర్ల పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాగా, పెసర పంటకు వంద శాతం కనీస మద్దతు ధరను ప్రకటించాలని, ఈ-టోకెన్ విధానాన్ని రద్దు చేయాలని, భూమి రికార్డుల ఆధారంగా ఎరువుల పంపిణీ జరగాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు.. ఆ రాష్ట్ర సీఎం ఇంటి ముట్టడికి రైతుల బృందం నర్మదాపురం నుండి భోపాల్‌కు పాదయాత్ర చేపట్టింది. ఒబదుల్లాగంజ్ వద్ద రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా రెండో రోజు కూడా రైతుల రహదారిపై బైటాయించి ఆందోళనలు చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తారని ‘క్రాంతికారీ కిసాన్ మజ్దూర్ సంఘటన్’ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ పటేల్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ లో రెండో రోజు అన్నదాతల ఆందోళనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



