నాణ్యతకు ప్రాధాన్యం.. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
నవతెలంగాణ-కొండాపూర్
గ్రామీణాభివృద్ధి, జల సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఫామ్‌పాండ్ పనుల పురోగతిని పరిశీలించేందుకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO), డిప్యూటీ CEO గ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (APD) గురువారం కొండాపూర్ మండలాన్ని సందర్శించారు. ముందుగా మండల స్థాయిలో ఫామ్‌పాండ్ పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించిన అధికారులు, పనుల వేగం, నాణ్యత, లక్ష్యాల సాధనపై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించారు. అనంతరం గంగారం గ్రామంలో కొనసాగుతున్న ఫామ్‌పాండ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రతి పనిని నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా నాణ్యతతో అమలు కావాలని సూచించారు. పనులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో గ్రామ సర్పంచ్ సరితఅశోక్, మండల అభివృద్ధి అధికారి (MPDO),అదనపు కార్యక్రమ అధికారి (APO), ECలు, టెక్నికల్ అసిస్టెంట్లు (TAs), ఫీల్డ్ అసిస్టెంట్లు, APM,సీసిలు, పంచాయతీ కార్యదర్శులు (PSలు),కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (CCలు), ఫీల్డ్ అసిస్టెంట్ రవి, పంచాయతీ సభ్యులు, ఇతర సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



