నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు మున్సిపల్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ బీజన బాలమణి అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కోతులు, కుక్కల నిర్మూలన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పట్టణ సమగ్ర అభివృద్ధి కొరకు పని చేస్తున్నామన్నారు. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనుల గురించి కౌన్సిలర్, కౌన్సిల్ సభ్యులకు వివరించారు. జరిగిన అభివృద్ధి పనుల గురించి శ్వేత పత్రం విడుదల చేయాలని బిఆర్ఎస్, బిజెపి కౌన్సిలర్లు చైర్మన్ ని కోరారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కె. ఆంజనేయులు, కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు, మేనేజర్ బి.జగన్మోహన్, ఏ.ఇ, మోహన బాలయోగి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సిఎచ్, పవన్ కుమార్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



