– సర్పంచ్ పోలయ్య పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియ తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈఎఫ్ (ఎన్యూమరేషన్ ఫారం) పూర్తి చేయని అర్హులైన ఓటర్లు వెంటనే పూర్తి చేసి సంబంధిత బీఎల్ఓ లకు అందజేయాలని అచ్యుతాపురం గ్రామ సర్పంచ్ పోలయ్య కోరారు. బుధవారం అచ్యుతాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక జీపీఓ అన్వేష్ అధ్యక్షతన బీఎల్ఓలు, బీఎల్ఏ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీపీఓ అన్వేష్ ఎస్ఐఆర్ కార్యాచరణ పురోగతి నివేదికను చదివి వినిపించారు.
పంచాయతీలోని 150, 151 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 2002 ఓటరు జాబితా ప్రకారం మొత్తం 1,271 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. సవరణ ప్రక్రియలో ఇప్పటివరకు 47 మంది మృతిచెందిన వారిని, గ్రామం నుంచి పూర్తిగా తరలివెళ్లిన 32 మందిని, ఓటు ఉన్నప్పటికీ కనీస సమాచారం ఇవ్వని 30 మందిని, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగిన 8 మందిని గుర్తించినట్లు వివరించారు. ఈ సమావేశంలో తిరుపతిరావు, ఉపసర్పంచ్ పాకనాటి నాగేశ్వరరావు, బీఎల్ఓ లలిత, బీఎల్ఏలు కొనకళ్ల చెన్నారావు, పసుపులేటి లక్ష్మయ్య, మడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



