నవతెలంగాణ-హైదరాబాద్: స్కాట్లాండ్ గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు మరో రెండు పతకాలు ఖాయం కానున్నాయి. మహిళల బాక్సింగ్ విభాగంలో సాక్షి (51 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు) సెమీ-ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు జమకానున్నాయి. అదే విధంగా వెయింట్ లిప్టింగ్ లో ఆయా కేటగిరీల్లో మరో నలుగురు భారతీయ బాక్సర్లు కూడా ఈ రోజు పతకాలను ఖాయం చేసుకునే అవకాశం ఉంది. క్వార్టర్-ఫైనల్స్ ల్లో ఆడనున్నారు. మరోవైపు, గురువారం జరగనున్న పురుషుల షాట్ పుట్ ఫైనల్‌కు తజిందర్‌పాల్ సింగ్ తూర్, సమర్దీప్ సింగ్ గిల్ ఇప్పటికే అర్హత సాధించారు. పారా స్విమ్మింగ్‌లో చైతన్య విశ్వాస్ కులకర్ణి, సుయాష్ నారాయణ్ జాదవ్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ S7 ఫైనల్‌కు చేరుకోగా, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ తన మొదటి ప్రయత్నంలోనే ఫైనల్‌కు అర్హత సాధించి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు మరో రెండు పతకాలు ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



