నవతెలంగాణ-మిడ్జిల్
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఆపదలో అండగా ఉంటానని మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మన్ననూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల నాయకులు కాకునూరు జైపాల్ రెడ్డి తండ్రి రాఘవరెడ్డి గత మూడు రోజుల క్రితం మరణించారు. దీంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి బుధవారం మున్ననూర్ కు వెళ్ళి జైపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా రాఘవరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాఘవరెడ్డి మృతి కుటుంబానికి తీరని లోటు అన్నారు. కుటుంబంలో ఇంటి యజమాని లేని లోటును ఎవరూ పూడ్చలేరని అన్నారు. ఇకపై జైపాల్ రెడ్డే కుటంబానికి అన్నీ తానై చూసుకోవాలని సూచించారు. అధైర్యపడోద్దని, మీకు ఎప్పుడు ఏ ఆపదా వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాండు యాదవ్, మాజీ ఎంపీపీ సుదర్శన్ బరిగెల, మాజీ జడ్పీటీసీ శశి రేఖాబాలు, దోనూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, యూత్ వింగ్ అధ్యక్షులు బంగారు నాయకులు జగన్ గౌడ్, నామాని శ్రీనివాసులు, శేఖర్ రెడ్డి రాజేందర్ రెడ్డి, మల్లయ్య మధు, యాదయ్య, బాల్ రాజ్, అమృతయ్య, వెంకటయ్య, మహేష్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.



