Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసర్ర్పైజ్ అవుతారు

సర్ర్పైజ్ అవుతారు

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో పరిచయం అవుతు న్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషించారు. నిర్మాత పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నేడు (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇది కంప్లీట్ లవ్ స్టోరీ. అలాగే చాలా ఇంటెన్స్, ఎమోషనల్ స్టోరీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా. ఫిక్షన్ కథ. అయితే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కూడా కొన్ని సీన్స్ రాశాను. అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. మోహన్ బాబు క్యారెక్టర్‌తో పాటు ఇంకా చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. పెద్ద నరేష్ క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు. అన్ని ఒరిజినల్ లొకేషన్స్‌లో తీశాం. ఆడియన్స్ క్యారెక్టర్స్‌లోకి, ఆ వరల్డ్‌లోకి వెళ్లిపోతారు. సినిమా మీద 100 శాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సాంగ్స్ చాలా బాగుంటాయి. థియేటర్స్‌లో విజువల్స్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు.

అలాగే సౌండింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. జై కృష్ణ, రాషా తడాని జోడిని ఆడియన్స్ చాలా ఇష్టపడతారు. జై కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరి పోతుంది. తనను స్క్రీన్ మీద చూసినప్పుడు ఆడియన్స్ చాలా సర్ప్రైజ్ అవుతారు. రాషా తడానీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఫిల్మ్‌మేకర్ రిలీజ్ అవుతున్న సినిమానే బెస్ట్ అవ్వాలనుకుంటాడు. నేను కూడా అదే అనుకుం టున్నాను. నా ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్లాలని ఆశిస్తున్నాను. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సాంగ్స్, యాక్షన్, ఎమోషన్స్, క్యారెక్టర్స్… అన్నీ బాగుంటాయి. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి ఉంటుంది. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన ప్రతి సినిమాను ఎంకరేజ్ చేస్తారు. ఇక మహేష్ బాబు కూడా సినిమా చూశారు. ఆయన సినిమా అదిరి పోయిందని ప్రశంసించారు. ఆ ప్రశంస మాకు సినిమా మీద నమ్మకాన్ని పెంచింది. ‘మంగళవారం 2’ గురించి ఇప్పుడే ఎక్కువ చెప్పలేను. అయితే అందులో ఉండే ఎలిమెంట్స్, క్యారెక్టర్స్, గూస్‌ బంప్స్ వచ్చే సీన్స్… చూసి ఆడియన్స్ షాక్ అవుతారని ప్రామీస్ చేస్తున్నా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -