Thursday, July 30, 2026
E-PAPER
Homeఆటలు10వేల మీ. ప‌రుగులో గుల్వీర్ కు రజతం

10వేల మీ. ప‌రుగులో గుల్వీర్ కు రజతం

- Advertisement -

గ్లాస్గో: కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో 10వేల మీ. పరుగులో గుల్వీర్‌ ‌సింగ్‌ ‌రజత పతకం సాధించగా.. ఐదుగురు బాక్సర్లు సెమీస్‌‌కు చేరి పతకాలు ఖాయం చేశారు. కామన్వెల్త్‌ ‌క్రీడల 10వేల మీ. పరుగులో భారత్‌‌కు ప‌త‌కం అందించిన తొలి భారతీయుడిగా గుల్వీర్‌ నిలిచాడు. ‌బుధవారం జరిగిన 10వేల మీ. ప‌రుగును గుల్వీర్ సింగ్ 27నిమిషాల 49.78 సెక‌న్ల‌లో పూర్తిచేసి రెండోస్థానంలో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా అథ్లెట్ కై రాబిన్‌స‌న్ ఉన్నాడు. 27 నిమిషాల 48.93 సెకన్ల సమయంతో రాబిన్‌స‌న్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని ఎగురేసుకుపోయాడు. స్కాట్‌స్టోన్ స్టేడియంలో భారీ వ‌ర్షం మ‌ధ్య ప‌దివేల మీట‌ర్ల ఈవెంట్‌ను జరిగింది. ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలోనూ భార‌త అథ్లెట్ గుల్వీర్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. ఆరంభం నుంచి లీడింగ్‌లో ఉన్న 28 ఏళ్ల గుల్వీర్‌.. ఫినిషింగ్ ల్యాప్స్ స‌మ‌యంలో అద్భుతంగా దూసుకెళ్లాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆత్రౌలీకి చెందిన అత‌ను ప్ర‌స్తుతం ఆర్మీలో పని చేస్తున్నాడు. అమెరికాలోని స్కాట్ సిమ్మ‌న్స్ స‌మ‌క్షంలో గుల్వీర్ శిక్ష‌ణ పొందుతున్నాడు. ఇక మ‌హిళ‌ల హై జంప్‌లో భార‌త్‌కు నిరాశ ఎదురైంది. ఆసియా చాంపియ‌న్ పూజా సింగ్‌.. టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. 1.82 మీట‌ర్ల ఎత్తును ఆమె జంప్‌ చేయ‌లేక‌పోయింది.

బాక్సర్లకు పతకాలు ఖాయం…
బాక్సర్లకు పతకాల పంట పండనుంది. బుధవారం జరిగిన క్వార్టర్‌ ‌ఫైనల్లో ఐదుగురు బాక్సర్లు విజయం సాధించి సెమీస్‌‌కు చేరారు. దీంతో వీరికి కనీసం కాంస్య పతకాలు దక్కనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -