Thursday, July 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ జలాశయాలకు పోటెత్తుతున్న వరద...

తెలంగాణ జలాశయాలకు పోటెత్తుతున్న వరద…

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో పాటు జూరాల, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జలపాతాలు, నదీ తీర ప్రాంతాల వద్ద పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -