Thursday, July 30, 2026
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల ఆందోళన

పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ మకర ద్వారం వద్ద ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టాయి. జంతర్ మంతర్ వద్ద ఈనెల 25న నిరసన చేపట్టిన జెన్ జీ పై లాఠీచార్జీను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. న్యాయమైన డిమాండ్ల కోసం, యువత భవిష్యత్ కోసం చేపట్టిన శాంతియుత ఆందోళనలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని విపక్ష ఎంపీలు మండిపడ్డారు. యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. జెన్ జీ నిరసనలకు మద్దతుగా నిలిచిన, పాల్గొన్న వారిపై మోడీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎవరిపైనా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయబోమని జెన్ జీకి హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తూ జెన్ జీని మోసం చేస్తుందని విపక్షాలు మండిపడ్డాయి. ఉభయసభల్లో అయోధ్య విరాళాల దుర్వినియోగం చర్చ జరపాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -