Wednesday, September 9, 2026
E-PAPER
Homeజాతీయందతియా అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్..32.53 శాతం ఓటింగ్

దతియా అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్..32.53 శాతం ఓటింగ్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ లోని దతియా అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు సుమారు 32.53 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ, తగిన భద్రతా ఏర్పాట్ల మధ్య నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంతకుముందు, ఉదయం 9 గంటల వరకు నమోదైన ప్రారంభ పోలింగ్ సరళిలో ఓటింగ్ శాతం 12.94గా ఉంది.

ఉదయం 7 గంటలకు అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అంతకముందు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైన మాక్ పోల్, 7 గంటల లోపే ముగిసింది. ఓట్ల లెక్కింపు ఆగస్టు 3న చేపడతారు. ఏప్రిల్ 2న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హతకు గురికావడంతో దతియా అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అశుతోష్ తివారీని బరిలోకి దించగా, కాంగ్రెస్ ఘన్‌శ్యామ్ సింగ్‌ను అభ్యర్థిగా నిలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -