- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని మోడీ కుర్చీ కాపాడారని మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ‘‘నీట్ పేపర్ లీక్ వల్ల చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పేపర్ లీక్ కాకుండా ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు చర్యలు చేపట్టలేదు. 2024లోనే ఈ బిల్లును ఎందుకు తీసుకురాలేదు? దిల్లీలో విద్యార్థుల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అమిత్షా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ ఘటనకు ఆయన బాధ్యత వహించాల్సిందే’’ అని అన్నారు.
- Advertisement -



