- Advertisement -
– పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలి: డీఎస్పీ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ – ఊరుకొండ
పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని కల్వకుర్తి డిఎస్పి ఎస్.వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం ఊరుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కల్వకుర్తి డిఎస్పి వెంకట్ రెడ్డి కల్వకుర్తి సీఐ భీమ్ కుమార్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఊరుకొండ ఎస్సై రమాదేవి, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



