Thursday, July 30, 2026
E-PAPER
Homeజిల్లాలుఅకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

– మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి..
నవతెలంగాణ – ఊరుకొండ

గత మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాల నేపథ్యంలో  ఊరుకొండ మండల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ.. మబ్బులు పట్టి వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు పాతబడిన, బలహీనమైన ఇళ్లలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇళ్లు కూలిపోయే ప్రమాదకర స్థితిలో ఉంటే వెంటనే సురక్షితమైన వేరే ప్రాంతాలకు లేదా వేరే ఇళ్ల కు మారాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అనవసర ప్రయాణాలు చేయవద్దని, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు మరియు రోడ్లపై ప్రవహిస్తున్న ఉధృతమైన నీటిని దాటే ప్రయత్నం ఎవరూ చేయవద్దని హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.  బాధితులకు అవసరమైన సహాయక చర్యలను అధికారులు అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -