Friday, July 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నారాయణపేట జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మ్యాతరి గోపాల్

నారాయణపేట జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మ్యాతరి గోపాల్

- Advertisement -

ఉప సర్పంచుల హక్కుల సాధనే లక్ష్యం
గౌరవ వేతనం అధికారాలు, గుర్తింపు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్
నవతెలంగాణ-మక్తల్ 

గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప సర్పంచుల హక్కుల సాధన, గౌరవం కోసం తెలంగాణ ఉప సర్పంచుల ఫోరం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శుక్రవారం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సభలో నిర్వహించిన ఉప సర్పంచుల సమావేశంలో నారాయణపేట జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మ్యాతరి గోపాల్ ను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బొట్ల కార్తీక్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తున్న ఉప సర్పంచులకు ఇప్పటికీ తగిన గుర్తింపు అధికారాలు, ఆర్థిక భరోసా లేకపోవడం విచారకరమన్నారు. ఉప సర్పంచులకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని, ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై సర్పంచ్ పేరుతో పాటు ఉప సర్పంచ్ పేరును కూడా తప్పనిసరిగా పొందుపరచాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా గ్రామ పంచాయతీ తీర్మానాలపై ఉప సర్పంచులకు సంతకం చేసే అధికారాన్ని కల్పించాలని, మండల స్థాయి సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచులను అధికారికంగా ఆహ్వానించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్లు అమలైతే గ్రామ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెరుగుతుందని తెలిపారు.నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన మ్యాతరి గోపాల్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతానని ఏ ఉప సర్పంచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంధం పురుషోత్తం, రాష్ట్ర కార్యదర్శి గణేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దింటి తాయప్ప గౌరవ అధ్యక్షుడు ఎలాన్ కోటి చెన్నప్ప, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, అధికార ప్రతినిధి మాలరాజు, మహిళా అధ్యక్షురాలు శిరీషతో పాటు మక్తల్, నర్వ, మాగనూర్, కృష్ణ, ఉట్కూర్, నారాయణపేట, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి, ధన్వాడ, దామరగిద్ద, కోస్గి తదితర 13 మండలాల 100 కి పైగా ఉప సర్పంచులు పాల్గొని. సభను విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -