Friday, July 31, 2026
E-PAPER
Homeఖమ్మంఅభివృద్ధి పథంలో అశ్వారావుపేట

అభివృద్ధి పథంలో అశ్వారావుపేట

- Advertisement -

– రూ.15 కోట్లతో అభివృద్ధి కార్యాచరణ
– ఆగస్టులో పనులకు శ్రీకారం
– మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఏకైక నూతన మున్సిపాలిటీ అయిన అశ్వారావుపేట ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు, పాలకవర్గం సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన నవతెలంగాణ తో పేర్కొన్నారు.

పట్టణ అభివృద్ధి కోసం సుమారు రూ.15 కోట్లతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఇందులో రూ.7 కోట్లతో నూతన మున్సిపల్ కార్యాలయ భవనం, రూ.5 కోట్లతో దొంతికుంట సుందరీకరణ తో పాటు ట్యాంక్‌బండ్ నిర్మాణం, రూ.1.5 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి, రూ.1 కోట్లతో మున్సిపల్ మార్కెట్ నిర్మాణం, రూ.50 లక్షలతో ఆధునిక ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని, ఆగస్టు నెలలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

దొంతికుంట సుందరీకరణ, ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలోనే శంకుస్థాపన చేసారని తెలిపారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 పథకం కింద రూ.1 కోట్ల వ్యయంతో పట్టణంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీల శుభ్రత, పరిశుభ్రత కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.

భవిష్యత్తులో మినీ స్టేడియం, ఎకో పార్క్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఏరియా ఆసుపత్రి, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులు పూర్తయితే అశ్వారావుపేట రూపురేఖలు పూర్తిగా మారిపోయి ఆధునిక పట్టణంగా అవతరిస్తుందని కమిషనర్ దిలీప్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -